తెలుగు ప్రజలకు గరికపాటి నరసింహారావు పరిచయస్తులు. ఇటీవలే పద్మశ్రీ అవార్డును కూడా గరికపాటి అందుకున్నారు. అయితే ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూ ఇస్తున్నారు గరికపాటి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. ఇవాళ సినిమాలు రౌడీ, ఇడియట్ అంటూ వస్తున్నాయి. నిన్నకాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప లో హీరో ఒక స్మగ్లర్. అలా స్మగ్లింగ్ చేసే వాళ్ళను మంచిగా చూపించారు.
అదేంటి అని అడిగితే చివరలో మంచిగా చూపిస్తాం, పుష్ప పార్ట్2 తీస్తాం, లేకపోతే పార్ట్ 3 తీస్తాం అంటున్నారు. అంటే నువ్వు తీసి చూపించే వరకు ఇక్కడ సమాజం చెడి పోవాలా, ఈ సినిమా కారణంగా స్మగ్లింగ్ గొప్ప అనే భావన రాలేదా అంటూ చెప్పుకొచ్చారు. గరికిపాటి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 17న రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించారు.
అలాగే సమంత స్పెషల్ సాంగ్ లో నటించారు. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ను స్టార్ట్ చేయబోతున్నారు.