ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఐదవ స్థానంలో నిలిచారు. పెట్టుబడులకు గురువుగా ప్రసిద్ధి చెందిన వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టి ఆయన ఆ స్థానానికి చేరుకున్నారు.
తాజాగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం… వారెన్ బఫెట్ 121.7 బిలియన్ డాలర్ల సంపదను ఆదానీ(123.2 బిలియన్ డాలర్లు) అధిగమించి ఐదో స్థానంలో నిలిచారు.
మరో భారతీయ సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 104.2 బిలియన్ డాలర్లు.
ఇటీవల ఎలెన్ మస్క్ 11.5 బిలియన్ల సంపదను నష్టపోయారు. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
ఆ తర్వాత రెండో స్థానంలో జెఫ్ బేజోస్, మూడో స్థానంలో బెర్నాల్డ్ అర్నాల్డ్, నాలుగవ స్థానంలో మెక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల జాబితాలో ఆదానీ 6 వ, ముఖేశ్ అంబానీ తొమ్మిదవ స్థానంలో నిలిచారు.