అదానీ సంపద ఆవిరవుతోంది. ఎన్నో ఏండ్లు కష్టించి సంపాదించిన సంపద అంతా ఒక్క సారిగా మంచు గడ్డలా కరిగిపోతోంది. హిండెన్ బర్గ్ నివేదికతో మొదలైన అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన సంపద 80 బిలయన్ డాలర్లు పడిపోయింది.

అదానీ కంపెనీ జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఒక్క నివేదికతో అదానీ సామ్రాజ్యం పునాదులన్నీ కదిలి పోయాయి. సిమెంట్స్ నుంచి పోర్ట్స్ వరకు, ఆయిల్స్ నుంచి ఎనర్జీ వరకు అన్ని రంగాల్లో అప్పటి వరకు తిరుగులేని వ్యాపార వేత్తగా ఎదిగారు.
కానీ నివేదిక తర్వాత ఆ పరిస్థితి మారి పోయింది. అదానీ గ్రూపునకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్టయ్యాయి. ఈ నెల రోజుల్లో అదానీ సంపద రూ. 12 లక్షల కోట్లు కరిగిపోయింది. అదానీ గ్రూపునకు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు గత నెల రోజుల్లో అత్యంత నష్టం పొందిన షేర్ల జాబితాలో నిలిచాయి. ఈ నెల రోజుల్లో అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర 78.5 శాతం పతనమైంది. జనవరి 24న 3885.45 గా ఉన్న షేర్ ధర ప్రస్తుతం 753.60కి పడిపోయింది.