ఏపీ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి (50) అంత్యక్రియలు ముగిశాయి. నెల్లూరులోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర.. జొన్నవాడ, బుచ్చిరెడ్డి పాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డీసీపల్లి, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి మీదుగా ఉదయగిరి వరకు సాగింది.
ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.దారిపొడవునా అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆయన అకాల మరణం పలువురు రాజకీయ నాయకులను షాక్ కు గురిచేసింది. మంత్రి కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉదయగిరికి చేరుకుని.. మంత్రి మేకపాటి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. మంత్రి పార్ధివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు.
ఈ సోమవారం ఉదయం మంత్రి గుండెపోటుకు గురయ్యారు. ఒక్క సారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు నిర్ధారించారు డాక్టర్లు.