మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో మాజీ డీజీపి గౌతమ్ సవాంగ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెండేళ్ల 8 నెలల కాలంలో చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అంతే కాకుండా పోలీసు వ్యవహార శైలిలో మార్పులకు కృషి చేశామని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని తాను డీజీపీగా పనిచేసిన సమయంలో సైబర్ మిత్ర, దిశ పోలీసుస్టేషన్‌లు చక్కగా పని చేశాయని అన్నారు.
స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపామన్నారు. ఏపీ మొబైల్ సేవా యాప్‌కు కూడా విశేష స్పందన వచ్చిందని తెలిపారు.
రెండేళ్ల 8 నెలలు డీజీపీగా నన్ను కొనసాగించిన సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గౌతమ్ సవాంగ్.