తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడని సామెత. కాలంతోబాటుగా స్థితులు, పరిస్థితులూ కూడా మారుతుంటాయి. ఏడాది కిందటి వరకూ ఇండియాలో రిచెస్ట్ ఫ్యామిలీ ఏదంటే సెకండ్ థాట్ లేకుండా అంబానీ కుటుంబం అని ఠక్కున చెప్పేసేవారు.
ఇక దేశంలో ఎత్తైన ఇల్లు ఎవరిది అన్న ప్రశ్నకు కూడా అంబానీల పేరు మాత్రమే సమాధానంగా వినిపించేది. కానీ ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలకూ ఆన్సర్ మారింది. రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ప్లేస్ను గౌతమ్ ఆదానీ టేకోవర్ చేశారు. అంబానీ ఎత్తైన ఇంటికి పోటీదారుగా గౌతమ్ సింఘానియా నిలిచారు.
ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం. దేశంలో అత్యంత ఎత్తైన ఇళ్ల జాబితాలో ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్లో అంబానీ ఫ్యామిలీయే ఉంది. కానీ నెంబర్ 2 పొజిషన్ మాత్రం జారిపోయింది.
మొన్నటి వరకూ నెంబర్1 స్థానంలో ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా ఉండగా నెంబర్ 2 స్థానంలో అతని సోదరుడు అనిల్ అంబానీ నివాసం ఉండేది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ను ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియా ఆక్రమించారు.
173 మీటర్ల ఎత్తైన ముఖేష్ అంబాని ఇల్లు ఆంటిలియాలో మొత్తం 27 అంతస్తులు ఉంటాయి. ఈ ఇంటిలో లేని సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. 80 సీట్ల సామర్థ్యం కలిగిన సినిమా థియేటర్ మొదలు హెలీప్యాడ్ స్విమ్మింగ్ పూల్ జిమ్ సెంటర్ సెలూన్ ఐస్ క్రీమ్ పార్లర్ వంటివి చాలా ఉన్నాయి. కేవలం కార్ల పార్కింగ్ కోసమే ఆంటిలియాలో 6 అంతస్తులు వదిలిపెట్టారు.
అవును మరి ముఖేష్ వద్ద ఏకంగా168 కార్లు ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఈ ఇంటి విలువ సుమారు 12 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక అనిల్ అంబానీ ఇల్లు Abode దేశంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో సెకండ్ ప్లేస్లో ఉండేది.
16 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో 66 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ఆకాశహార్మ్యం కూడా అత్యద్భుతంగా రూపు దిద్దుకుంది. ఇందులోనూ హెలిప్యాడ్ స్విమ్మింగ్ పూల్ మొదలు ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇంటి విలువ సుమారు 5 వేల కోట్లుగా ఉంటుందని అంచనా.
ఇప్పుడు దానికన్నా ఎత్తైన ఇంటిని నిర్మించారు గౌతమ్ సింఘానియా. దాని పేరు JK హౌస్. రేమండ్ గ్రూప్ చైర్మన్ అయిన సింఘానియా ముఖేష్ అంబానీ ఇల్లు ఉన్న ఏరియాలోనే తన ఇంటిని నిర్మించారు. మొత్తం 16 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో 145 మీటర్ల ఎత్తుతో ఏకంగా 30 అంతస్తులతో ఇల్లు కట్టేశారు సింఘానియా.
ఈ ఇంటిలోనూ 5 అంతస్తులను కేవలం పార్కింగ్ కోసం వదిలిపెట్టారు. అంబానీ నివాసంలో ఉన్న ప్రతీ సౌకర్యం ఇందులో కూడా ఉందని సమాచారం. సింఘానియా ఇంట్లోని ప్రతీ అంతస్తును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కుటుంబంలోని ప్రతీ వ్యక్తి అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. సువిశాలమైన ఈ ఇంటిలోని ప్రతీ అంతస్తులో పచ్చదనం కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు.