అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు గౌతమి. అగ్ర హీరోయిన్ గా ఆమె పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఈ మధ్య ఆమె నటిస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. కమల్ హాసన్ తో ఆమె సుదీర్ఘ కాలం సహజీవనం చేసారు. ఆ సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె వెనక్కు తగ్గలేదు.
అయితే 2017 లో కమల్ హాసన్ తో ఆమె విడిపోయి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. సినిమాల మీద ఫోకస్ పెడుతూ మంచి అవకాశాలు వస్తే నటించాలి అని ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో ఆమె మహేష్ బాబుకి అమ్మగా నటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో ఆమెను త్రివిక్రమ్ పక్కన పెట్టారనే ప్రచారం కూడా ఉంది.
తాజాగా గౌతమి ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణతో ఎందుకు నటించలేదు అనే దానికి ఆమె సమాధానం ఇచ్చారు. బిజీ షెడ్యూల్ ఉండటం కారణంగానే తాను వారి ఇద్దరి సినిమాల్లో నటించలేదు అని అన్నారు. అవకాశం వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నాను అని తెలిపారు. వాళ్ళతో అప్పుడు నటించడానికి తనకు ఆఫర్లు కూడా వచ్చాయని తెలిపారు. తన కుమార్తె తన ప్రమేయం లేకుండా సినిమాల్లోకి వచ్చారని అన్నారు.