ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరో వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది.
ఎక్సైజ్ పాలసీ విధానంలో మార్పుల విషయంలో కీలక పాత్ర పోషించారంటూ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మల్హోత్రాను ఈడీ ఈ రోజు అదుపులోకి తీసుకుంది.
మద్యం కుంభకోణంలో ఈ రోజు ఇది రెండో అరెస్టు కావడం గమనార్హం. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు.
ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా గౌతమ్ మల్హోత్రా ఉన్నారు. మల్హోత్రాను ఈ రోజు మధ్యాహ్నం సీబీఐ కోర్టులో హాజరుపరచున్నారు.
మల్హోత్రను కస్టోడియల్ రిమాండ్‌కు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరనున్నట్టు సమాచారం. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఏడుగురిని ఈడీ అరెస్టు చేసింది.