గౌతమ్ వాసుదేవ్ మీనన్… సౌత్ ఇండియా క్లాస్ డైరెక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. పోలీసు డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ కథలను తెరకెక్కించటంలో గౌతమ్ మీనన్ ది ప్రత్యేక శైలి. ఓవైపు సినిమాలు తీస్తూనే… మరోవైపు కొన్ని కథల్లో తను కూడా నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
గౌతమ్ మీనన్ అల్లు అర్జున్ కోసం ఓ పోలీస్ డ్రామా కథను రాసుకున్నారని… త్వరలోనే ఆయన బన్నీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ రేసుగుర్రం సినిమాలో పోలీస్ అధికారిగా కొద్దిసేపు కనిపించినా… పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయలేదు. దీంతో బన్నీ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. కానీ బన్నీ ఇప్పటికే వరుసగా సినిమాలు చేసేందుకు కమిట్ అయి ఉన్నారు.
కానీ గౌతమ్ మీనన్ ఎలా బన్నీని ఒప్పిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.