ఇది వరకటి రోజుల్లో స్వలింగ సంపర్కం అంటే ఏదో పెద్ద నేరంలా చూసేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అది సాధారణమైన విషయం అయిపోయింది. వారి మనసులనూ, వారి ఆలోచనలనూ పెద్దలు అర్థం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే కోల్ కతాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం…
కోల్‌కతా, గురుగ్రాంకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కలు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్, చైతన్య శర్మ గురుగ్రామ్‌లో డిజిటల్ మార్కెటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ స్వలింగ సంప్కరులు. ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ నెల 3న ఘనంగా పెళ్లిచేసుకున్నారు.
అభిషేక్ రే సంప్రదాయ బెంగాలీ వరుడిలా ధోతీ, కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీని ధరించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. వీరిద్దరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.