గీతా రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
చిన్న రాష్ట్రాల ఏర్పాటు మంచిదని అంబేద్కర్ చెప్పారు. ఆయన వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సోనియమ్మ పెట్టిన బీక్ష నీ పదవి. కేసీఆర్ రాజ్యాంగాన్ని చదివావా..? ప్రధాని కావాలని ఉందా?
జైలుకు వెళ్తా అనే భయం పట్టుకున్న కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు. ముందు నుండి బీజేపీకి మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకి అంటే నమ్ముతామా..? ప్రపంచంలోనే అన్నిటికన్నా గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం.
కేసీఆర్.. బాబా సాహెబ్ అంబేద్కర్ తో పోల్చుకుంటావా..? ఆర్టికల్ 368 ప్రకారం సవరణలు చేసుకోవచ్చు అని ఉంది. ఇప్పటికే 105 సార్లు సవరణలు జరిగాయి. అలాంటిది కొత్త రాజ్యాంగం అంటావా.
కేసీఆర్ క్షమాపణలు చెప్పి అంబేద్కర్ కు పాలాభిషేకం చేయకపోతే వదిలేది లేదు. గల్లీ గల్లీలో కాంగ్రెస్ వెంటాడుతుంది.