భారత సైనిక దళాల అత్యున్నతాధికారి సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం దేశ రాజధానిలోని యుద్ధ స్మారక స్థూపం దగ్గర ఆయన నివాళులర్పించారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను ఆర్మీ చీఫ్ గా కొనసాగానని ఈ రోజు నుంచి కొత్తగా సీడీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే పదవిని సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. కొత్త పదవిలో వ్యూహా రచన చేస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అయితే అదే రోజు ఆయనను కొత్త పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీడీఎస్ పదవిని కొత్తగా సృష్టించారు. భారత సైన్యంలోని త్రివిద దళాలను సమన్వయ పరిచేందుకు, ఆయుధ నిల్వల కోసం ఓ అధికారి అవసరమని గుర్తించిన ప్రభుత్వం ఈ పదవిని సృష్టించింది.
Advertisements
నిజానికి కార్గిల్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లప్పుడే లోపాలను గుర్తించిన ఆనాటి ప్రభుత్వం త్రివిధ దళాల సమన్వయానికి ఓ అత్యున్నతాధికారి అవసరమని గుర్తించింది. దాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ సబ్ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ప్రకారం సీడీఎస్ పదవిని సృష్టించారు. అమెరికా, రష్యా లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ పదవి ఉంది.