అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించడంపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 8న రూ.750 కోట్ల రుణాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా అనౌన్స్ చేసింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
అదే విధంగా ఈ నెల 8న హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళల ఎదుగుదలను గుర్తించే రోజుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఉమెన్స్ డే ను ఘనంగా జరుపుకుంటాయి.