సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జెంటిల్‌మేన్. దర్శకుడిగా పరిచయం అవుతూ శంకర్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ శంకర్ ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం అందరికీ నచ్చడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తమిళంలో జెంటిల్‌మేన్ పేరుతో ప్రముఖ నిర్మాత కే.టి.కుంజుమోన్ తెరకెక్కించారు. తెలుగులో అదే జెంటిల్‌మేన్ టైటిల్‌తో ఏ.ఎం.రత్నం.. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌లో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఈ సినిమా ఇక్కడ కూడా ఎన్నో అవార్డ్ లను కూడా గెలుచుకుంది. ఇదిలా ఉండగా చాలా రోజులు నుంచి జెంటిల్‌మేన్ 2 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత కుంజుమోన్. అయితే హీరో , దర్శకుడు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.
కాగా తాజాగా ఈ సినిమాకు కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్టు ప్రకటించారు. జెంటిల్‌మేన్ చిత్రానికి అప్పట్లో ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
.@KT_Kunjumon announces that Swaravaani @mmkeeravani will be scoring music for #GentlemanFilmInternational's#Gentleman2
🔥Gold coin Winners will be announced 🔜#ஜென்டில்மேன்2 #ജെന്റിൽമാൻ2 #जेंटलमेन2 #ಜಂಟಲ್ಮನ್2#జెంటిల్మాన్2 pic.twitter.com/D9fAGVbdPZ
— BA Raju's Team (@baraju_SuperHit) January 23, 2022
Advertisements