సినిమాలో దమ్ము ఉండాలే కానీ అదిరిపోయే బిజినెస్ కావడానికి ఒక్క టీజర్ చాలు. చిన్న సినిమా జార్జిరెడ్డి టీజర్ తో క్రేజీ బిజినెస్ జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి నాయకుడి రియల్ స్టోరీని జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. వైవిధ్యమైన కథాంశం కావడంతో దానిపై ఆసక్తి పెరిగింది. దీనికితోడు మూవీ క్రియేటివ్ టీం టీజర్ ను వారేవా అనే రీతిలో కట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. అంతే.. జార్జిరెడ్డి మూవీపై క్రేజ్ పెరిగింది.
జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో విద్యార్థి పోరాటాల్లో పాల్గొని యువకుల్ని ఉత్తేజితుల్ని చేసి, చివరికి ప్రత్యర్థుల చేతుల్లో దారుణ రీతిలో హత్యకు గురయ్యాడు. అతని కథనే వెండితెరపై అదే పేరుతో చూపించేందుకు రియలిస్టిక్ గా మూవీని తీశారు. ఇప్పటికే మూవీ టీజర్ చిత్రసీమ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్ నచ్చి ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను రూ.5కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. తెలుగులో మరే చిన్న చిత్రానికి థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంత భారీ ధర దక్కలేదట. ఈ మూవీ నిర్మాతలు ఈ సినిమాకు రూ.10 కోట్లు దాకా ఖర్చు చేశారు. థియేట్రికల్ రైట్స్ ద్వారానే సగానికి పైగా పెట్టుబడి వచ్చింది. మిగతాది శాటిలైట్ హక్కుల రూపంలో వస్తుంది. చిన్న చిత్రం విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకుకోని బాక్సాఫీస్ బరిలోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రామ్‌గోపాల్ వర్మ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న శాండీ ఈ సినిమాలో టైటిల్ పాత్రను పోషించారు. మరో ప్రముఖ నటుడు సత్యదేవ్ కీలక పాత్రను పోషించారు. చిన్న చిత్రం జార్జిరెడ్డి మాంచి బిజినెస్ కావడం టాలీవుడ్ కు శుభ పరిణామం.