మరో చేగువేరాగా, విద్యార్థి ఉద్యమాలకు చుక్కానిగా జార్జిరెడ్డి పేరు చిరస్మరణీయం. అందుకే జార్జిరెడ్డి అనే వ్యక్తి చనిపోయినా… ఆ పేరు ఇంకా బ్రతికే ఉంది. అలాంటి వ్యక్తి జీవిత కథ ఆధారంగా సినిమా వస్తుందంటే… అందరినూ ఆసక్తి ఉంటుంది. అందుకే చిన్న సినిమానే అయినా అందరి అటెన్షన్‌ను డైవర్ట్ చేసుకోగలిగింది.
కానీ కమ్యూనిజం-కమర్షిలిజం ఒకే ఓరలో ఒదగవు. మరో విప్లవానికి నాంది పలికే ఇలాంటి సినిమాను… డైరెక్టర్ కమర్షియల్‌గా ఆలోచించి చంపేశాడు అనటంలో ఎలాంటి సందేహాం లేదు. అందుకే జార్జిరెడ్డి అంటే ఇష్టంతో సినిమాకు వచ్చిన జనం జార్జిరెడ్డిని మళ్ళీ చంపేశారు కదరా అని బాధపడ్డారు. కమర్షియల్ హీరోస్‌కు ఎలివేషన్ కావాలి కానీ జార్జిరెడ్డిలాంటి వారు రియల్ లైఫ్ హీరోస్. ఎమోషన్ ఉంటే చాలు.. కానీ అదే మిస్ అయింది ఈ సినిమాలో.
పరమ చెత్త డైరెక్షన్‌కు తోడు హీరోయిన్ క్యారెక్టర్, ఆ బుల్లెట్ సాంగ్‌ను చూసి ఫస్ 5నిమిషాల్లోనే ప్రేక్షకులను అప్ చేశాడు డైరెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్, ఆమె డబ్బింగ్ మరీ ఘోరంగా ఉన్నాయి. మంచి బడ్డెట్, అదిరిపోయే స్టోరీ పెట్టుకొని డైరెక్టర్ సినిమాను ఇలా చేసినందుకు జార్జి అభిమానులంతా గుర్రుగా ఉన్నారు.
సినిమా మొత్తం మాంటేజ్ షాట్స్ ఉన్నాయి. ఇది జార్జిరెడ్డి సినిమా అనటం కన్నా మాంటేజ్ సినిమా అనటం బెటర్ అనేది సగటు ప్రేక్షకుడి ఫీలింగ్. ఓ సీన్‌లో ఓ క్యారెక్టర్ అడుగుతుంది. జార్జ్ చేసిన 5 ముఖ్యమైన పాయింట్స్ చెప్పు అని. ఆ టైంకు సినిమా చూస్తున్న ప్రేక్షకులది కూడా అదే ఫీలింగ్.
యువ సినిమాలో సూర్య క్యారెక్టర్ జార్జిరెడ్డి ఆధారంగా తీసిందే. చాలా చిన్న క్యారెక్టర్ అయినా… ఇప్పటికీ గుర్తుంటుంది. అలాంటిది బయోపిక్ అని చెప్పుకునే ఈ సినిమాలో ఏలాంటి ఎమోషన్ లేదు. సినిమాలో దాదాపు 30 ఫైట్ సీన్స్‌లో ఏ ఒక్కటీ బాగలేదు సరికదా… ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే మ్యూజిక్ డైరెక్టర్‌ను కొట్టాలనిపించేలా చెత్తగా ఉంది.
జార్జిరెడ్డి అనే విప్లవ స్వరూపాన్ని పొడిచి, పొడిచి చంపే సీన్ చూసిన ఎవరికైనా రక్తం ఉప్పొంగాలి. ప్రేక్షకుల్లో ఉద్రేకం రావాలి కానీ… హమ్మయ్య సినిమా అయిపోయింది అనేంత చెత్తగా సినిమా తీశారు.
సినిమా ఇండస్ట్రీలో చాలామంది గొప్పగొప్ప వాళ్లు ఉన్నారు. సినిమా చూస్తున్న వాళ్లు మాట్లాడుకున్న మాట ఒక్కటే… జార్జిరెడ్డికి మళ్ళీ అన్యాయమే జరిగింది. మళ్ళీ ఎవరో ఒకరు ఈ సినిమా చెయ్యాలి. ఎప్పటికైనా సరైన డైరెక్టర్‌తో, పూర్తి ఎమోషన్ క్యారీ చేసే కాంబినేషన్‌తో సినిమా రావాలి అన్నది సినిమా చూస్తున్న అందరి ఫీలింగ్.
పంచ్ లైన్స్– 1. తిరుగుబాటు తీసుకరావాలన్నా… దాన్ని తెరకెక్కించాలన్నా దమ్ముండాలి. అదే డైరెక్టర్‌లో పూర్తిగా మిస్ అయింది.
2. కామర్స్, కమ్యూనిజం ఎప్పటికీ ఒకే ఓరలో ఇమడని రెండు కత్తులు.
ALSO READ:
జార్జిరెడ్డిపై పీడీఎస్‌యూ మద్దతుదారుల స్పందన