45 సంవత్త్సరాల క్రితం చనిపోయిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కతున్న చిత్రం జార్జ్ రెడ్డి. అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 17 న నెక్లెస్ రోడ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపాలని జార్జ్ రెడ్డి మూవీ టీమ్ నిర్ణయించింది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తున్నారని మూవీ యూనిట్ చెప్పటం తో భద్రత దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా వస్తే అటు ఫ్యాన్స్ తో పాటు ఉస్మానియా విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్ సంఘాలు పెద్ద ఎత్తున వస్తారని ఆ తరుణంలో పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉందంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ వస్తే పర్మిషన్ ఉండదా
జీవన్ రెడ్డి దర్శకత్వం లో స్యాండీ హీరోగా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల తరువాత మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఈ నెల 22 న ఈ సినిమాని విడుదలకు సిద్ధంగా ఉంది.