ఉక్రెయిన్‌కు జర్మనీ నేరుగా ఆయుధాలను అందజేస్తుందని జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్ కు 1000 యాంటీ ట్యాంక్ ఆయుధాలు, 500 స్టింగర్ మిస్సైల్స్ పంపనున్నట్టు చెప్పారు.
ఈ విషయాన్ని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలేనా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఉక్రెయిన్ పై దాడి చేయాలని పుతిన్ నిర్ణయించిన తర్వాత ప్రపంచం విభిన్నంగా మారిపోయిందన్నారు.
అంతర్జాతీయ చట్టాన్ని రష్యా ఉల్లంఘించినందుకు మనం ఆశ్చర్యపోయామని, అయినప్పటికీ మనం శక్తి హీనులం కాదన్నారు. అందుకే ఉక్రెయిన్ సైనికులకు యాంటీ ట్యాంక్ వెపన్స్, స్టింగర్ క్షిపణులతో తాము సహాయం చేస్తామని తెలిపారు.
స్వదేశంలో తయారు చేసిన ఆయుధాలను ఘర్షణ జరుగుతున్న ప్రాంతాలకు పంపడంపై ఉన్న పరిమితులను ఎత్తి వేస్తున్నట్టు జర్మనీ తాజాగా ప్రకటించింది.
అదే సమయంలో స్విఫ్ట్ గ్లోబల్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ను రష్యా యాక్సెస్ చేసుకోకుండా ఆంక్షలు విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు రష్యా మంత్రులు తెలిపారు.