తెలుగులో ఫస్ట్ టైమ్ 10 కోట్ల టికెట్ల రూపంలో సాధించిన సినిమా చిరంజీవి ఘరానా మొగుడు.! 1992లో విడుదలైన ఈ సినిమా కన్నడ “అనురాగ అరళితు సినిమాకు తెలుగు రిమేక్. కె.రాఘవేంద్రరావ్ డైరెక్షన్ లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
చిరంజీవి, నగ్మా, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1993 ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. అదిరిపోయే డాన్సులు, కమెడీ టైమింగ్, డిఫరెంట్ మ్యానరిజాన్ని చూపించిన చిరంజీవికి ఈ సినిమాతో మెగాస్టార్ అనే స్క్రీన్ నేమ్ లభించింది.
కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక బంగారుకోడి పెట్ట అనే సాంగ్ ను రామ్ చరణ్ మగధీర కోసం రిమిక్స్ కూడా చేశారు.
సినిమా స్టోరి సింపుల్ గా:
వైజాగ్ పోర్టులో పని చేసే రాజు (చిరు)… తన తల్లి (శుభ) కి పక్షవాతం రావటంతో హాస్పిటల్ లో చూపించడానికి హైద్రాబాద్ కి వస్తాడు….ఇక్కడే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా….. ప్రత్యర్థుల దాడి నుండి బడా పారిశ్రామిక వేత్త అయిన బాపినీడు (రావు గోపాలరావు) ని రక్షిస్తాడు.రాజు మంచితనాన్ని మెచ్చిన బాపినీడు రాజుకు తన సంస్థలోని ఒక ఉద్యోగం ఇస్తాడు. రాజు అంటే గిట్టని బాపినీడు కుమార్తె ఉమాదేవి (నగ్మా) …రాజుని పెళ్ళి చేస్కొని అతని నోరు మూయించాలని చూస్తుంది. అదే సమయంలో రాజు తన సెక్రటరీ అయిన భవాని (వాణీ విశ్వనాథ్) తో చనువుగా ఉండడాన్ని ఉమాదేవి అపార్థం చేస్కొంటుంది. మరోవైపు తన కొడుకుతో సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుందన్న కారణంతో ఉమాదేవిని అంతం చేయాలని చూస్తుంటాడు రంగనాయకులు (కైకాల సత్యనారాయణ). రాజు రంగనాయకులు నుండి తన భార్యని రక్షించుకోవటంతో ఉమాదేవి రాజులోని మంచితనాన్ని గుర్తిస్తుంది.