మారుతున్న కాలానికి తోడు టెక్నాలజీతో విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది. అందులోనూ స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా పడుతోంది. దీంతో చెడు అవాట్లను అలవరుచుకుంటున్నారు. సరదాకి అనుకుని తోటి విద్యార్థుల్నే విధింపులకు గురి చేస్తున్నారు.
తాజాగా ఘట్ కేసర్ లోని విజ్ఞాన భారతి కాలేజీలోని యువకులు.. విద్యార్థినుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. విద్యాబుద్దులు నేర్చుకుని, ఉన్నత భవిష్యత్ కు బాట వేసుకోవాల్సిన ఆ యువకులు.. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థినుల వాట్సాప్ డీపీలను తీసి, వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేస్తున్నారు. వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.
మరికొందరు ఆ మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను ఆ విద్యార్థినులకే రాత్రి సమయంలో పంపి, వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
మరోవైపు ఈ మార్ఫింగ్ ఫొటోలపై విద్యార్థినులు ఆందోళన చేపట్టడంతో.. కాలేజీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఫోటోలు వలన తమ కుటుంబ పరువు పోతుందని, వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.