కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్ కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే యువతి బలవన్మరణం పై రకరకాల వార్తలు తెరమీదకు వస్తున్నాయి. కథ సుఖాంతమైందనుకున్న సమయంలో యువతి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే యువతి డిప్రెషన్ లోకి వెళ్లడం వల్లే సూసైడ్ చేసుకున్నట్లు పేరెంట్స్ చెబుతున్నారు. అయితే తాను చేసిన పని చాలా తప్పుడు పని అని తన గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారని అవమానంతోనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన తరువాత కూడా సోషల్ మీడియాలో సదరు యువతి పై విపరీతమైన ట్రోల్స్ జరిగాయి. దీంతో సమాజంలో తన పరువు పోయిందని, ఈ నేపథ్యంలోనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అవమానభారంతోనే యువతి ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి కాల్ డేటా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.