గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేశాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ప్రచారంతో పాటు ఉదయం నుండి ఫలితాల సరళి కూడా బీజేపీ-టీఆర్ఎస్ మధ్యే ఆసక్తికరంగా సాగింది.
ఫైనల్ రిజల్ట్స్-
టీఆర్ఎస్- 56
బీజేపీ-49
ఎంఐఎం-43
కాంగ్రెస్-2
ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ… మరో 25 సీట్లు వస్తాయని ఆశించామని, ఆశించిన విధంగా ఫలితాలు రాలేదన్నారు.
ఇక ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… తన పదవికి రాజీనామా చేశారు.
ఫలితాలు బీజేపీ కార్యకర్తల పనితీరుకు నిదర్శనమని, అడ్డదారుల్లో గెలవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధిచెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగు స్థానాల నుండి 50 స్థానాలకు వచ్చామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో గెలుపే లక్ష్యమన్నారు.