గ్రేటర్ హైద్రాబాద్ లో వరదలు సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు కుటుంబానికి 10వేలు ఇస్తామని ప్రకటించింది. కొందరికి ఇచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ రావటంతో… ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. దీంతో మీసేవ ద్వారా పరిహారం తీసుకునేందుకు వేల మంది చేసుకున్న దరఖాస్తులు అలాగే ఉన్నాయి.
డిసెంబర్ 7నుండి వరద సహయం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో…. వరదసాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. అర్హులను గుర్తించి తామే వరదసాయం అందిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని, వరదసాయం అందని వారి వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. బాధితుల అకౌంట్‌లోనే వరదసాయం డబ్బులు జమ చేస్తామని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.
దీంతో మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటీ అన్నది ఆసక్తికరంగా మారింది.