హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తొమ్మిది రోజులు పూజలందుకొని నిమజ్జనం కోసం భారీ ఎత్తున గణనాథులు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పుతో నిమజ్జనంపై ఉన్న ఆంక్షలు కూడా తొలగిపోయాయి. దీంతో నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
విగ్రహాల నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్ పరిసరాలలో 24 క్రేన్ లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిమజ్జనం కోసం గుర్తించిన పలు రిజర్వాయర్లు, 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ వద్ద మొత్తం 300 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరగకుండా 100 మంది గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉంచనున్నారు. విగ్రహాలు వచ్చే ప్రాంతాల్లో దాదాపు 9వేల మంది శానిటైజ్ చేయబోతున్నారు. విద్యుత్ వైర్లు లేకుండా చేయటం, చెట్లు లేకుండా చేసే పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.
మొత్తం 30వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండనుండగా… నిమజ్జనం కోసం ఇటు ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశాయి.