GHMC టౌన్ ప్లానింగ్ అధికారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్మన్ ఘాట్ దుర్గా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజు అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తను నివసిస్తున్న పాత ఇంటిపైన ఫ్లోర్ నిర్మాణ పనులు చేస్తుండగా నా ఇంటికి వెంటిలేషన్ ఉండదు అని నిర్మాణ పనులను పక్క ఇంటి యజమాని శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇదే అంశంపై కోర్టను ఆశ్రయించగా కోర్టు నిర్మాణ పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేసింది. రాజు మరొక్కసారి కోర్టును ఆశ్రయించగా బాత్రూం,ఇంటి మెడ పైకి మెట్ల నిర్మాణం చేసు కోవాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇంటికి మెట్లు,బాత్రూం నిర్మిస్తుండగా పక్కయింటి శ్రీనివాస్ GHMC అధికారులకు ఫోన్ తో సమాచారం ఇచ్చాడు.
రాజు ఇంట్లో లేని సమయంలో వచ్చిన అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అతను లేని సమయంలో బాత్రూమ్,మెట్లు ను కూల్చి వేయడంతో మనస్తాపం చెందాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.