మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫైన్ వేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ అధికారులు మంత్రికి ఫైన్ వేశారు.ఐదు వేల రూపాయలను చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. మరోవైపు మంత్రి తలసాని శనివారం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. సోమవారం సీఎం కేసీఆర్ బర్త్ డే కావడంతో జలవిహార్ లో వేడుకలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ బాల్యం నుంచి ఇప్పటివరకు ఆయన ప్రస్థానాన్ని ఫొటోల రూపంలో ప్రదర్శిస్తామని తలసాని తెలిపారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని వెల్లడించారు.