లాక్ డౌన్ ముందు నుండి హైదరాబాద్ లో మాంసం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మటన్ రేటు ఆకాశాన్నంటుతోంది. దీంతో నగర జనం నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పైగా సరైన శుభ్రత కూడా పాటించకుండా, ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా, కొన్ని షాపులైతే కనీసం అనుమతులు కూడా లేకుండా మటన్ విక్రయాలను చేస్తున్నాయి.
మటన్ అధిక ధరకు అమ్ముతున్న షాపులపై ఇప్పటికే దాడులు చేస్తున్న జీహెచ్ఎంసీ, మటన్ కిలో 700కు మించి అమ్మరాదని స్పష్టం చేసింది. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే ఈ ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయండి అని జోన్ల వారీగా నెంబర్లు ఇచ్చింది.
LB Nagar – 9989930359, 9989930357, 9154032869,
Charminar Zone- 9989930359, 9177904941, 99889930212, 9100361357
Khairthabad- 9704456521, 9989930356, 9154113797, 9154113791
Serilingampally- 9866699401
Kukatpally- 9704456520, 9154115007
Secunderabad- 9704456520, 9989930397, 9154156672, 9154156670
రంజాన్ మాసంలో జీహెచ్ఎంసీలో మటన్ వాడకం అధికంగా ఉండటం, లాక్ డౌన్ ఎత్తివేస్తున్న నేపథ్యంలో అధికారులు మటన్ ధర కట్టడికి ప్రయత్నిస్తున్నారు.