గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా…. ప్రజలు మాత్రం లైట్ తీసుకున్నట్లు కనపడుతుంది. ఓట్లు వేయాల్సిన జనం ఇంటికే పరిమితం అయ్యారు.
ముఖ్యంగా అమీర్ పేట్ ప్రజలు అసలు ఎన్నికలు అన్న విషయమే మర్చిపోయినట్లు ఉన్నారు. ఓటు వేయండి మహా ప్రభో అని ఎంత నెత్తి నోరు బాదుకున్న ఏ మాత్రం వినిపించుకోవటం లేదు.
అమీర్ పేట్ లో 40వేల ఓట్లకు కేవలం నాలుగు వందల ఓట్లు పోలయ్యాయి అంటే ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అమీర్ పేట్ లో 0.79శాతం పోలింగ్ అంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు.
ఐటి కోచింగ్ సెంటర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అమీర్ పేట్ లో ఇలాంటి పరిస్థితి పై అంతా పెదవి విరుస్తున్నారు.