గ్రేటర్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో ఇవాళ సమావేశమైంది.ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ తేదీలపై ఈ భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దాదాపుగా డిసెంబర్ మొదటివారంలోనే గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు రేపు ఓటర్ల జాబితాను ఈసీ రిలీజ్ చేయనుంది. దీపావళి తర్వాత ఎన్నికల షెడ్యూల్ ను, ఆ తర్వాత నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పెంచాలని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.5లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో రూ.2.5లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.