జీహెచ్ఎంసీలో పోలింగ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నగరంలో సమస్యలపై సోషల్ మీడియాలో వీరలెవల్లో పోస్టులు పెట్టే ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం ఉత్సాహం చూపడం లేదు. మూడు వంతుల సమయం దాటినా.. పోలింగ్ శాతం పెరగడం లేదు. పోలింగ్ సరళి చూస్తోంటే మొత్తం ప్రక్రియ ముగిసే వరకూ యాభై శాతం లోపే నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఉదయం 11గంటల వరకు 9శాతం వరకే నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం 3గంటల వరకు 25.34శాతంగానే ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లో 64.79 శాతం పోలింగ్ నమోదైంది. అత్తాపూర్, పురానాపూల్‌లలో 50 శాతానికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు
ఇక రాజేంద్రనగర్‌లో 24.62 శాతం, చార్మినార్ 24.23, సంతోష్‌నగర్ 17.26, మలక్‌పేట 15.88, చాంద్రాయణగుట్ట 15.19, ఫలక్‌నుమా 17.61, మాదాపూర్ 22.70, మియాపూర్ 25.47, హఫీజ్‌పేట 20.98, చందానగర్ 21.42, కొండాపూర్ 19.64, గచ్చిబౌలి 26.56, శేరిలింగంపల్లి 23.24, సరూర్‌నగర్‌లో 26.61 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.