నిబంధనలు ఉల్లంఘించే వారిపై జీహెచ్ఎంసీ కొరడా జుళిపిస్తోంది. అనుమతి లేకుండా ప్లెక్సీలు పెట్టినా, రోడ్లపై ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లినా…ఓపెన్ నాలాలో చెత్త వేసినా… ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేసినా…వాల్ రైటింగ్స్ రాసినా…రోడ్ల మీద సరుకులు వేసి ప్రజలకు అసౌకర్యానికి గురిచేసినా…జీహెచ్ ఎంసీ భారీగా ఛలాన్లు వేస్తుంది. తాజాగా బోయిన్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర టీఆరెస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు పేరు మీద కటౌట్ పెట్టిన ఆర్.ఆనంద్ బాబు గౌడ్ కు జీహెచ్ ఎంసీ రూ.5000 జరిమానా విధించింది.