కరోనా వైరస్ మహమ్మారీ ఉప్పెనలా విరుచకపడుతున్న నేపథ్యంలో… అన్ని రాష్ట్రాలు మాస్క్ లను తప్పనిసరి చేశాయి. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలు, షాపుల వద్ద కనపడితే భారీగా జరిమానా విధిస్తున్నాయి.
ఏపీలో ఒక్కరోజే 17లక్షల ఇలా మాస్క్ లు లేని వారికి ఫైన్ ద్వారా వచ్చాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాస్క్ లేని వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకపోతే 1000రూపాయలు, షాపుల్లో మాస్కులు లేకుండా కనపడితే 2వేల రూపాయల ఫైన్ విధించింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులతో కలిసి పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ చేపట్టారు. ప్రజలంతా ప్రభుత్వంతో సహకరించి… కోవిడ్ నిబంధనలు పాటించాలని, లేదంటే వ్యవహరం లాక్ డౌన్ వరకు వెళ్తుందని హెచ్చరించారు.