నగరంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి సెల్లార్లన్నీ నీటితో నిండిపోతున్నాయి. ఆ వరద నీటిని తోడేయలేక… యజమానులు అవస్థలు పడుతున్నారు. అయితే, తోడేస్తున్న నీటిని రోడ్డుపైకి వదిలేయటం… అక్కడ రోడ్డు డ్యామేజ్ కావటం కామన్ అయిపోయింది. కానీ ఈసారి ఆ యాజమన్యానికి భారీగా ఫైన్ వేసింది. బయోడైవర్సిటీ వద్ద నందన్ వెంచర్స్ సెల్లార్‌లో నీటిని ఎప్పట్లాగే ఆ యజమాని పంపుసెట్‌తో రోడ్డుపై వదిలారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మధ్య తరచూ అక్కడ ట్రాఫిక్ జామ్ అయితుండటంతో… ట్రాఫిక్ పోలీసులు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. దాంతో… రోడ్డు దెబ్బతిన్నందుకు, వరద నీటిని రోడ్డుపైకి వదిలినందుకు గానూ… 2లక్షల ఫైన్ విధించారు అధికారులు.
అయితే, అక్కడ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదే. వరద నీటిని నియంత్రించటం, ఇళ్లలోకి రాకుండా చూడటంతో పాటు… సజవుగా వరద నీరు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేయాలి. కానీ అవేమీ లేకుండా… ఇలా వరద నీటిని ఎత్తిపోసినందుకు ఫైన్ వేయటం సరైంది కాదంటున్నారు అక్కడి కాలనీల వాసులు. పైగా… సెల్లార్‌కు, అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది కూడా ఫైన్ వేసిన జీహెచ్‌ఎంసీ అధికారులే. తప్పు జీహెచ్‌ఎంసీది. ఖర్చుపెట్టుకొని మరీ… తమ ఇబ్బందుల నుండి బయట పడాలనుకున్నాం. కానీ… మళ్లీ మాకే ఈ జరిమానాలా అని ప్రశిస్తున్నారు భవన యజమానులు.