గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల హామీలో భాగంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ఉచిత మంచి నీరు పథకం ప్రారంభం అయ్యింది. మంత్రి కేటీఆర్ రెహమత్ నగర్ డివిజన్ లో ప్రారంభించారు. అయితే, కేసీఆర్ ఇచ్చిన నెలకు 20వేల లీటర్ల ఉచిత నీరును పొందేందుకు ఖచ్చితంగా మీటర్లు ఉండాలని సర్కార్ షరతు విధించారు.
గ్రేటర్ లో మొత్తం 10లక్షలకు పైగా నల్లా కనెక్షన్లు ఉండగా… అందులో కేవలం 2.37లక్షల గృహ సముదాయాలకు మాత్రమే మీటర్లు ఉన్నారు. దీంతో ఉచిత నీరు పథకం కింద అర్హులు కావాలంటే మీటర్లు బిగించుకోవటం తప్పనిసరి అంటూ కేటీఆర్ ప్రకటించారు. అపార్ట్మెంట్ వాసులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద 97శాతం మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.
అయితే, 20వేల లీటర్లు దాటాక… లీటర్ నీటికి ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుందన్న అంశంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.