గులాబ్ తుపాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ, వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్పా జనం ఇంట్లో నుండి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కోరింది.
వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఆరెంజ్ అలెర్ట్ చేసిన నేపథ్యంలో… నగర వాసులకు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. జీహెచ్ఎంసీలో ఆఫీసర్లందరికీ సెలవులు రద్దు చేసిన అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నందున లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అన్ని జోనల్, డిప్యూటీ కమిషనర్ల ఆఫీసులను అర్ట్ చేసింది.
ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు పూర్తిగా నిండి ఉన్నందున మూసీలోనూ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని… ప్రజలంతా అధికారులకు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరింది.