ఉత్కంఠగా మారిన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. గతేడాది చివర్లో జరిగిన గ్రేటర్ ఎన్నికలు, ఫలితాల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. ఇప్పుడా ఆ గెజిట్ ఆధారంగా సభ్యుల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరగనుంది.
ఫిబ్రవరి 11న ఉదయం 11గంటలకు కొత్తగా గెలిచిన కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ వెంటనే 12.30గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.
అయితే, గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాలు దక్కించుకున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకున్నా అధికార టీఆర్ఎస్ కు మేయర్ స్థానం దక్కేలా లేదు. దీంతో ఎంఐఎంతో పోత్తు పెట్టుకుంటుందా…? మూజువాణి ఓటు ద్వారా మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ ప్లాన్ వేసిందా…? అన్న ప్రచారం మొదలైపోయింది.
ఈసారి గ్రేటర్ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది.