గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఎన్నికల హామీలో ఒకటైన డిసెంబర్ నుండి 20వేల లీటర్ల ఉచిత తాగునీరు హామీని అమలు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ నెలలో వాడుకున్న 20వేల లీటర్ల బిల్లు జనవరిలో వస్తుందని, ఆ బిల్లులో ఈ రాయితీ ప్రజలకు అందేలా చూడాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. ఈ ఉచిత తాగునీరును ఎవరెవరికి వర్తింపజేయాలనే అంశానికి సంబంధించిన విధివిధానాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయబోతున్నారు. ఈ మేరకు జలమండలి అధికారులతో జీహెచ్ఎంసీ అధికారులు భేటీ అయ్యారు.