జీహెచ్ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నిక అయ్యారు . దీంతో వారి కుటుంబం, రాజకీయ నేపథ్యం వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది. మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి.. టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కేకే కూతురు. 2016లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి అదే డివిజన్ నుంచి గెలుపొందారు. జర్నలిజంలో బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివిన ఆమె..ఆ తర్వాత అమెరికా వెళ్లారు. 2007లో ఇండియా తిరిగొచ్చారు. విజయలక్ష్మీ బీసీ సామాజికవర్గానికి చెందినవారు.
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత విషయానికి వస్తే తార్నాక కార్పొరేటర్‌గా ఉన్నారు. గతంలో కొంతకాలంపాటు టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బీఏ చదివిన ఆమె.. బొటిక్ బిజినెస్ చేసేవారు. ఆమె భర్త ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీలత రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.