గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ మొదలుపెట్టింది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం, తెలంగాణలోనూ వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో… హైదరాబాద్ మహానగరంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంటింటికి జీహెచ్‌ఎంసీ కార్యక్రమాన్ని చేపట్టింది.
ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుండి విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి… కరోనా లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి తరలించేలా గ్రేటర్ సిబ్బంది వారి ఇళ్లకు వెళ్తున్నారు. పాస్‌పోర్టులోని అడ్రస్‌ల ఆధారంగా వారిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అధికారులు.
గ్రేటర్ పరిధిలో ఇప్పటికే విద్యాసంస్థలు, హాస్టళ్లు, థియేటర్లు, పార్క్‌లను మూసివేయగా… అవసరమైతే మరిన్ని కఠిన నిబంధనలు తీసుకరాబోతున్నారు.