నగరంలో బ్యానర్స్ కట్టడం నిషేధం. ఉల్లంఘిస్తే జరిమాన తప్పదు అని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తూనే ఉంది. సీఎం పుట్టిన రోజు సందర్భంగా మంత్రి తలసాని అనుమతి లేని కటౌట్స్ కట్టినందుకు జరిమాన కూడా చెల్లించారు. అయితే… బ్యానర్ల విషయంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు వేసిన ఫైన్‌ను ఎత్తేసింది జీహెచ్‌ఎంసీ.
మొక్కల పంపిణీ, తెలంగాణ హరితహరం పేరుతో ఖైరతాబాద్ జోనల్ పరిధిలో బ్యానర్లు వెలవటంతో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీస్‌కు 10వేల రూపాయల జరిమాన విధించింది. కానీ ఒక్కరోజులోనే ఆ జరిమానాను వెనక్కి తీసుకుంది జీహెచ్‌ఎంసీ.
ఆ బ్యానర్‌లు ఫ్లెక్సీతో కాకుండా… బట్టపైనే హరితహరం అని ముద్రించి, కట్టారట. దీంతో అలా బట్టతో కట్టినవి నిబంధనలకు విరుద్దం కాకపోవటంతో… జీహెచ్‌ఎంసీ పొరపాటును గ్రహించి, ఫైన్ వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు… ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే బ్యానర్లకు ముందస్తు అనుమతి అవసరం లేదని విజిలెన్స్ సంస్థ ప్రకటించింది.
Advertisements
ప్రభుత్వ సంస్థలు అయినంత మాత్రాన చలాన్ వెనక్కి తీసుకున్నారు, కానీ సామాన్యుని విషయంలో జీహెచ్‌ఎంసీ ఇలాగే స్పందిస్తుందా అని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఒక రూల్, అధికారులకు ఒక రూల్ ఎలా ఉంటుందని నిలదీస్తున్నారు.