నా ఐఏఎస్ చదువు వెనుక ఓ రైతు-హరిచందన - Tolivelugu

నా ఐఏఎస్ చదువు వెనుక ఓ రైతు-హరిచందన

IAS Harichandana about political leaders and corruption, నా ఐఏఎస్ చదువు వెనుక ఓ రైతు-హరిచందన

అవినీతికి అధికారులే కాదు ప్రజలు కూడా కారణమే అని వ్యాఖ్యానించారు ఐఏఎస్ అధికారి హరిచందన. లైన్‌లో నిలబడి టికెట్‌ కొనే ఓపిక లేక బ్లాక్‌లో టికెట్ కొన్నట్లు, అధికారిని కలిసేందుకు అర్ధగంట వెయిట్ చేయలేక అటెండర్‌కు పది రూపాయలు ఇచ్చి అధికారిని కలిస్తే… అవినీతికి రోడ్డు వేసినట్టే కదా అని ప్రశ్నించారు.

నాకు రాజకీయ నాయకుల నుండి ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయని… కానీ నిజమే అని నేను భావిస్తే చేస్తా, లేదంటే మానేస్తానని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో ఓ మహిళా ఉద్యోగి రెండు సంవత్సరాలు నిలకడ పనిచేసిన చరిత్ర లేదన్నారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు పరిస్థితులు లేవు.. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు నిలదీసే పరిస్థితి ఉంది, అధికారులు కూడా భయంతో పనిచేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.

తన తండ్రి ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యాక కూడా…. ఓ రైతు వచ్చి మీ వల్లే నా భూమి పట్టా నాకు దక్కింది, ఇప్పటికీ ఆ పొలం మీదే ఆధారపడి బతుకుతున్నాం… అంతా మీ వల్లే అంటూ ఆనందపడ్డారు. అందుకే లండన్‌లో సంవత్సరానికి కోటి రూపాయల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని తెలిపింది.

పనిచేసే మహిళలకు ఎక్కువ గౌరవం దక్కాలన్నది తన ఆలోచనని… పురుషులు ఒకే ఉద్యోగం చేస్తారు, మహిళలు మాత్రం ఇంట్లో ఓ ఉద్యోగం చేసుకుంటు ఆఫీసులో మరో ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందని తొలివెలుగు ముఖాముఖి విత్‌ జీఎన్నార్‌ షోలో అభిప్రాయపడ్డారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp