సముద్రంలో దొరికే చేపలతో ఒక్కోసారి మత్స్యకారులు లక్షాధికారులు అయిపోతుంటారు. ఎంతో అరుదుగా లభించే వాటిని పట్టుకోవడంతో వారి దశ తిరుగుతుంటుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. దాన్ని కచ్చిడి మగ చేప అని చెబుతున్నారు. 30 కిలోల బరువున్న ఈ చేపను చూసి మత్స్యకారులు ఎగిరి గంతేశారు.
కచ్చిడి చేప కడుపులో ఉండే బ్లాడర్ కు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఈ చేపను కొనేందుకు వ్యాపారులు సైతం ఎగబడ్డారు. రూ.4.30 లక్షలకు ఇది అమ్ముడుపోయింది.
కాకినాడ పరిసరాల్లో చేపకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారట. భారీ ధరకు చేప అమ్ముడుపోవడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.