ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనాకు, దాని వివిధ రూపాలకు అలవాటుపడి బతకటం నేర్చుకుంటోంది. ఇంతలోనే..మరో కొత్త ముప్పు. ఇది ఫ్లోరిడాలో బయటపడింది.
ఆఫ్రికా భూపొరల్లో నివసించే రకానికి చెందిన అరుదైన భారీ నత్తగుల్ల అమెరికా ఫ్లోరిడా కౌంటీలో కనిపించింది. ఇది అన్నినత్తగుల్లల్లాంటిది కాదు. దీన్నిఆధారం చేసుకుని ర్యాట్ లంగ్ వార్మ్ అనే ఒక పరాన్నభుక్కు జీవిస్తుంది.
దీనికి మెదడువాపు వ్యాధిని కలగచేసే లక్షణం ఉందని ఫ్లోరిడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ముఖ్యంగా పిల్లల పాలిట ఇది ప్రమాదకారి అని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నత్తగుల్లలు చాలా చిన్నపరిణామంలో ఉంటాయి. కానీ ఇవి 8 అంగుళాల పొడవు, 5 అంగుళాల విస్తీర్ణంతో భయం గొలిపేలా ఉన్నాయంటున్నారు.
ఉన్నట్టుండి ఈ ఆఫ్రికా రకం భారీ నత్తగుల్లలు ఎక్కడి నుంచి వచ్చాయి..ఎలా వచ్చాయి, వీటి వల్ల ప్రమాదం ఏ మేరకు పొంచి ఉంది అనేది పరిశోధనలు జరుపుతున్నారు.