ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంఘమిత్ర వైద్యశాలలో తన సతీమణితో కలిసి ఆయన పరీక్షలు చేయించుకోగా.. దంపతులిద్దరికీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా.. వారికి నెగెటివ్ వచ్చింది.
నెల రోజుల క్రితంమే వెంకట రాంబాబు మనవడికి పాజిటివ్ వచ్చింది. ఒంగోలులోనే చికిత్స అందించగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే దంపతులిద్దరు ఆస్పత్రిలో చేరారు.