ఇన్వెస్టర్స్ ను ఇన్వైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భారీ ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 నిర్వహిస్తోంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు గుర్తుండిపోయేలా విశిష్ట కానుకలతో కూడిన గిఫ్ట్ ప్యాక్స్ కూడా అందిస్తోంది.ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు వస్తువులను ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఉంచారు. మొత్తం 8 వేల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం జీఐఎస్-2023 వేదిక వద్ద పంపిణీ చేస్తోంది.
ఈ గిఫ్ట్ ప్యాక్ లో కలంకారీ డిజైన్ తో కూడిన పింగాణీ ప్లేట్, నోట్ బుక్, పెన్నులు, తదితర వస్తువులతో పాటు, తిరుపతి లడ్డూను, అరకు కాఫీ, టీ పొడులు, గిరిజన తేనె కూడా అందిస్తున్నారు. గిఫ్ట్స్ లో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు ఊరికే ఎందుకు వదిలేసి వెళ్తారు.
సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ఏ మేరకు పెట్టుబడులు సంపాదిస్తుందో తెలీదు గానీ..గిఫ్ట్ ప్యాక్ మాత్రం ఎక్కవ క్రేజ్ సంపాదించుకుంది. గిఫ్ట్ లు అందిన వారు సైలెంట్ గా ఉన్నారు. కానీ గిఫ్ట్ అందనివారిలో కొందరు డెలిగేట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రగడ సృష్టించారు. కొందరు అక్కడున్న తాత్కాలిక ఏర్పాట్లను చిందరవందర చేశారు.