ఇటాలియన్ వెండి తెర లెజెండ్, హాలీవుడ్ అందాల తార గినా లొల్లొ బ్రిగిడా (95) కన్నుమూశారు. వయసు రీత్యా ఎదురైన అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూసింది. దీంతో ప్రముఖులు, సినీ తారలు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థిస్తున్నారు. 50వ దశకాల్లో ఉమెన్ ఇన్ ది వరల్డ్ గా పేరు పొందింది గినా.ఈమె హీరోయిన్ గా చేస్తూనే ఫోటో జర్నలిజం కూడా నేర్చుకుంది. మిస్ ఇటాలియన్ 1947 పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచింది.
ఆమె ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు.1953లో బీట్ ది డెవిల్ లో ఆమె పోషించిన పాత్ర ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.తరువాత ఆమె కెరీర్ అంతా ఆశాజనకంగా సాగలేదు.
దాంతో ఫోటో గ్రాఫ్‌ను కెరీర్ గా ఎంచుకుని రాణించింది. రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసింది.ఇటాలియన్ లో ప్రతిష్టాత్మకమైన ఏడు డేవిడ్ డి డొనాటెల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఆ అవార్డును అక్కడి నటులు ఆస్కార్ తో సమానంగా భావిస్తారు.