రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం పలు సంక్షోభాలకు దారి తీస్తోంది.యుద్ధ వాతావారణం నెలకొన్న ప్రాంతాలలో అనేక మంది భారతీయులు చిక్కుకున్నారు.వారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సహాయక చర్యలు చేపడుతోంది.ఆపరేషన్ గంగ పేరుతో స్పెషల్ విమానాలు ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా అందరినీ స్వదేశాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.అయితే..ఓ భారతీయ డాక్టర్ మాత్రం తన పెంపుడు జంతువుల కోసం ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు.
ఎందుకంటే ఆయన పెంపుడు జంతువులను బహిరంగంగా పెంచుకోవడానికి ఇక్కడ అనుమతులు లేకపోవడమే అందుకు కారణం అని తెలుస్తోంది. ఉక్రెయిన్ లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఒక జాగ్వర్, ఒక పాంథర్ లను పెంచుకుంటున్నారు.ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇష్టంగా పెంచుకున్నఆ మూగ జీవాలను అక్కడే వదిలేయలేక తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ బంకర్లో వాటితో కలిసి తలదాచుకుంటున్నామని చెప్తున్నారు.
చిరంజీవి ‘లంకేశ్వరుడు’ సినిమా చూసి ప్రేరణ పొంది వాటిని పెంచుకుంటున్నట్టు గిరి కుమార్ స్పష్టం చేశారు.ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి..గిరి కుమార్ క్షేమాన్ని కోరుతూ ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Advertisements
ప్రియమైన గిరి కుమార్..జాగ్వార్స్, పాంథర్స్ ల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమతో నా నుండి ప్రేరణ పొందారని తెలిసి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.ఈ దురదృష్టకర యుద్ధ సమయంలో ఈ జీవుల పట్ల మీ ప్రేమ,కరుణ నిజంగా ప్రశంసనీయం అని అన్నారు.ఈ సమయంలో మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ సుదీర్ఘ నోట్ ను పంచుకున్నారు చిరంజీవి.