పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం తీరుపై గిరిజన సంఘం భగ్గుమంది. వనపర్తి జిల్లా నాగవరం శివారులోని సర్వే నెంబర్ 200లో ఈమధ్యే పోడు భూముల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గిరిజనులు వేసిన పంటను జేసీబీతో నాశనం చేశారు.
అయితే.. పోలీసులు చదును చేసిన భూమినోలనే ధర్నా నిర్వహించింది గిరిజన సంఘం. పంటలను నాశనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బాల్య నాయక్. భూములకు పట్టాలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో చెప్పాలని నిలదీశారు.