విశాఖపట్నం : ప్రేమికురాల్ని అనుమానంతో ఓ ఉన్మాది పైశాచికంగా ప్రవర్తించాడు. స్క్రూ డ్రైవర్ తీసుకుని మెడపై పొడిచాడు. అనకాపల్లిలో ఈ దారుణం జరిగింది. నాగసాయి అనే యువకుడు డిగ్రి చదువుతున్న విద్యార్థిని యశోద భార్గవిని ప్రేమించాడు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. పెళ్లికి ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోమని నాగసాయికి సూచించడంతో అతను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవల ప్రియురాలిపై అతనికి అనుమానం పెంచుకుని ఆమె పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై పొట్ట, మెడ భాగాల్లో గాయపరచాడు. తీవ్రంగా గాయపడిన యశోద భార్గవికి స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నాగసాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.