ఈ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రతీ ఒక్కరికి కూడా సెల్ఫీలు తీసుకునే అలవాటు చాలా ఎక్కువ అయిపోయింది. ఇక యూత్ లో అయితే ఈ సెల్ఫీ క్రేజ్ అనేది మామూలుగా ఉండదు. ఇక ఇలాంటి సెల్ఫీ మోజులో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోగా..చాలామంది చావు అంచుల దాకా కూడా వెళ్లి బ్రతికి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అయితే సెల్ఫీ పేరుతో అందరి ముందు తెగ నవ్వులపాలయ్యారు. తాజాగా అలాంటి నవ్వులు పూయించే వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆ ఫన్నీ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.
ఇక ఈ వైరల్ వీడియోలో బ్లూ కలర్ డ్రెస్ ధరించిన ఒక అమ్మాయి కాలువ ఒడ్డున నిలబడి.. రకరకాల ఫోజులు ఇస్తూ, కుప్పిగంతులు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటోంది. అయితే కాలువ గట్టు తడిగా ఉండటం, కాలు బ్యాలెన్స్ తప్పడంతో ఆమె ఆ కాలువలో బొక్కబోర్లా పడిపోయింది. ఆ తరువాత తేరుకుని పైకి లేస్తుంది. అయితే నీటి గుంటలో పడిపోవడంతో ఆమె డ్రెస్ అంతా బురదమయం అయ్యింది. కాగా, యువతి నీటి గుంటలో పడటాన్ని పక్కనే ఉన్న మరొకరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసి నెటిన్లు తెగ నవ్వుకుంటున్నారు. పాపం చిన్నది.. సంతోషం అంతా క్షణాల్లో చిన్నపోయింది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ పేజీ hepgul5లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు ఈ వీడియోను వేలాది మంది చూశారు. అలాగే అదే స్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి. మరెందుకు ఆలస్యం వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.
Advertisements